News January 4, 2025

దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం సమీక్ష

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. 635 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే రామాయపట్నం సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం జరగనుండటంతో దగదర్తి ఎయిర్ పోర్టుకు ప్రాధాన్యం పెరిగింది.

Similar News

News September 15, 2025

ఉదయగిరి: ఏటీఎం మార్చి నగదు కాజేసిన కేటుగాడు

image

ఉదయగిరిలో ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన సినిమా హాల్ వీధికి చెందిన ఓ మహిళ తన ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కి వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. దీంతో ఆ వ్యక్తి కొంత డబ్బులు డ్రా చేసి ఆమెకు సంబంధించిన ఏటీఎం కార్డు ఇవ్వకుండా వేరే కార్డు మార్చి అందులోని రూ.8 వేలు నగదును ఆ కేటుగాడు కాజేశారు.

News September 15, 2025

అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి టీకాలు : డీడీ

image

జిల్లాలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ డీడీ సోమయ్య తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పశు వ్యాధి నియంత్రణలో భాగంగా పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని ఏడీలు రామచంద్రరావు, చైతన్య కిషోర్‌లతో కలిసి ప్రారంభించారు. నాలుగు మాసాలు నిండిన పశువులకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.

News September 15, 2025

USలో లక్షల జీతం వద్దనుకుని.. నెల్లూరు SPగా

image

USలో లక్షల డాలర్ల జీతం వద్దనుకుని IPS బాట పట్టారు నెల్లూరు కొత్త SP అజిత వాజెండ్ల. గుంటూరు(D)కు చెందిన ఆమె ప్రైమరీ విద్యను AP, మెకానికల్ ఇంజినిరింగ్‌ను మద్రాస్ ITలో పూర్తి చేశారు. అనంతరం USలో భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరారు.అది నచ్చక సివిల్ సర్వీస్‌లోకి రావాలని HYD వర్సిటీలో పబ్లిక్ సర్వీస్‌లో పీహెచ్డీ చదువుతూ సివిల్స్‌కు ఎంపికయ్యారు. నగరంలో పెరుగుతున్న క్రైంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.