News January 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 7, 2025
BREAKING: ఆశారాం బాపునకు బెయిల్
వివాదాస్పద మతగురువు, సంత్ ఆశారాం బాపునకు రిలీఫ్ దొరికింది. మార్చి 31వరకు సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో ఉపశమనం కల్పించింది. అత్యాచారం కేసులో ఆయన యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలునుంచి బయటకొచ్చాక అనుచరులను కలవకూడదని ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం ఆయనకు 85ఏళ్లు.
News January 7, 2025
బిష్ణోయ్‌తో భయం: సల్మాన్ ఇంటికి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుతో ముప్పు ఉండటంతో యాక్టర్ సల్మాన్ ఖాన్ మరింత జాగ్రత్తపడుతున్నారు. తన గ్యాలక్సీ అపార్ట్‌మెంటు బాల్కనీ వద్ద భారీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. సాధారణంగా ఆయన ఇక్కడి నుంచే ఫ్యాన్స్‌కు చేతులూపి అభివాదం చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం ఇక్కడే ఆయనపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. అలాగే సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని కాల్చిచంపడం తెలిసిందే.
News January 7, 2025
ఫార్ములా-e: ఈ లింకుపైనే ACB కూపీ..
KTR చుట్టూ బిగుసుకుంటున్న ఫార్ములా-e రేస్ కేసులో ACB క్విడ్ ప్రో కో అంశంపై దర్యాప్తు చేస్తోంది. 2022లో గ్రీన్ కో, అనుబంధ సంస్థల నుంచి పలు దఫాలుగా BRSకు రూ.41 కోట్ల మేర ఎన్నికల బాండ్లు వచ్చాయని దర్యాప్తు సంస్థ గుర్తించింది. అటు 2023లో రూల్స్ పాటించకుండా ఆ సంస్థకు రూ.45 కోట్ల మేర బదిలీ చేసేలా KTR ఆదేశాలిచ్చారు. దీంతో ఇది ముందస్తు తెరవెనక ఒప్పందంలో భాగంగా జరిగిన చెల్లింపు అని ACB అనుమానిస్తోంది.