News January 4, 2025
బోయిగూడ: 69వ దక్షిణ మధ్య రైల్వే వారోత్సవాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735918068077_50024734-normal-WIFI.webp)
దక్షిణ మధ్య రైల్వే 69వ రైల్వే వారోత్సవాలను న్యూ బోయిగూడ రైల్ కళారంగ్‌లో శుక్రవారం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్లకు జోనల్ ఎఫిషియెన్సీ షీల్డ్‌లను, అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట రైల్ సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738750338333_52296546-normal-WIFI.webp)
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
News February 5, 2025
త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738748130517_51149288-normal-WIFI.webp)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738736231326_705-normal-WIFI.webp)
గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.