News March 17, 2024
నేడు పేటలో ‘ప్రజాగళం’ సభ
AP: ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా ‘ప్రజాగళం’ సభ నిర్వహించనున్నారు. ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని ఆ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. కాగా సాయంత్రం 4.10 గంటలకు మోదీ గన్నవరం రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బొప్పూడి చేరుకుని.. రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకుంటారు.
Similar News
News November 24, 2024
PIC OF THE DAY
ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉన్న విరాట్, గంభీర్ టీమ్ ఇండియా కోసం కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ భావోద్వేగానికి లోనయ్యారు. విరాట్‌ను హత్తుకుని అభినందించారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని టీమ్ ఇండియా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మ్యాచ్‌లో విరాట్ 143 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
News November 24, 2024
అఫ్గాన్ స్పిన్నర్‌కు రూ.10 కోట్లు
IPL మెగా వేలంలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అదరగొట్టారు. అతడిని రూ.10 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వహిండు హసరంగాను రూ.5.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇప్పటికే చెన్నైలో అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు ఉన్నారు.
News November 24, 2024
గుండెపోట్లు చలికాలంలోనే ఎక్కువ ఎందుకు?
చలి వల్ల కండరాలు బిగుసుకుపోయి గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి తగినంత బ్లడ్ సరఫరా చేసేందుకు హార్ట్ పని పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి దారి తీస్తుంది. బ్లడ్ ప్రెజర్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. చలికాలం శరీరాన్ని వెచ్చగా ఉండేలా చూసుకొని, వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.