News January 4, 2025
మాల్దీవుల ప్రగతికి అండగా ఉంటాం: జైశంకర్
మాల్దీవుల ప్రగతికి, సుస్థిరతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఆయన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని జైశంకర్ పేర్కొన్నారు. అటు.. భారత్‌తో బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు ఖలీల్ ట్వీట్ చేశారు.
Similar News
News January 7, 2025
ఫార్ములా-ఈ రేసు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును <<15086612>>ఆశ్రయిస్తే<<>> తమ వాదనలు కూడా వినాలంటూ కోరింది.
News January 7, 2025
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిరాజ్‌కు రెస్ట్!
ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు పేసర్ సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని BCCI భావిస్తోంది. 2023 నుంచి 671.5 ఓవర్ల బౌలింగ్ వేసిన అతనిపై పనిభారం తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే T20లకు రెస్ట్ ఇచ్చి వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. BGTలో ఆశించిన మేర రాణించకలేకపోయినా కీలక సమయాల్లో సిరాజ్ వికెట్లు తీశారు. JAN 22-FEB 2వరకు 5 T20లు జరగనున్నాయి.
News January 7, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి: మంత్రి అచ్చెన్న
AP: విశాఖ పర్యటనలో PM మోదీ శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌తో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. YCP హయాంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మోదీ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వేజోన్‌కు రేపు PM శంకుస్థాపన చేస్తారన్నారు. అటు హోంమంత్రి అనిత కూడా సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు.