News January 4, 2025

‘గేమ్ ఛేంజర్’ తర్వాత శంకర్ పాన్ వరల్డ్ మూవీ?

image

వరస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టైతే ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టును తీసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘వీరయుగ నాయగన్ వేల్పరి’ అనే పుస్తకం ఆధారంగా 3 భాగాల సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పైనే ఆ ప్రాజెక్ట్ ఆధారపడినట్లు సమాచారం.

Similar News

News January 7, 2025

పెళ్లిలో మందు, డీజే లేకపోతే రూ.21వేల బహుమతి

image

వివాహాల్లో మద్యం, డీజే సాధారణంగా మారిపోయాయి. వీటితో ఆనందంతో పాటు అవతలి వారికి అసౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించేలా పంజాబ్‌లోని బఠిండా జిల్లా బల్లా గ్రామ పెద్దలు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మద్యం, డీజే లేకుండా పెళ్లి చేసుకున్న వారికి రూ.21వేలు బహుమతిగా ఇస్తున్నారు. వృథా ఖర్చును తగ్గించేందుకే ఈ పథకం ప్రారంభించినట్లు సర్పంచ్ అమర్‌జిత్ కౌర్ తెలిపారు.

News January 7, 2025

బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలి: భట్టి

image

TG: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై Dy.CM భట్టి విక్రమార్క స్పందించారు. భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతలు ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆవేశంలో BJP కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు. దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

News January 7, 2025

ఫార్ములా ఈ కేసు.. రేపు విచారణకు అరవింద్

image

TG: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. అరవింద్ కుమార్ రేపు ACB విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో A-2గా ఉన్న ఆయన తన పరిధిలోని HMDA నుంచి FEOకు నిధులు బదిలీ చేశారు. KTR ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అరవింద్ వివరణ ఇవ్వగా, రేపు ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. ఆయన స్టేట్‌మెంట్ ఆధారంగా KTRను ACB తర్వాత విచారించే అవకాశం ఉంది.