News January 4, 2025

చలిపులి.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

image

TG: రాష్ట్రం చలిపులి గుప్పిట్లోకి చేరుకుంది. వచ్చే 2 రోజుల పాటు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన దుస్తులు వేసుకుని చలి నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు మంకీ క్యాప్‌లు, జెర్కిన్స్, చలి కోట్లు తప్పనిసరిగా ధరించాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప ఉదయం బయటికెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

Similar News

News January 7, 2025

చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసింది

image

అవయవదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బతికించే అవకాశం ఉంటుంది. అయితే, దీనిపై ప్రభుత్వాలు అవగాహన కల్పించినా చాలా మంది దీనికి ముందుకు రావట్లేదు. తాజాగా మహబూబ్‌నగర్‌కు చెందిన కేశ అలివేల(53) అనే మహిళ నిన్న చనిపోగా ఆమె కుమారుడు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. లివర్, రెండు కిడ్నీలు, రెండు కళ్లు డొనేట్ చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చారు. ఈ విషయాన్ని జీవన్ దాన్ వెల్లడించింది.

News January 7, 2025

పెళ్లిలో మందు, డీజే లేకపోతే రూ.21వేల బహుమతి

image

వివాహాల్లో మద్యం, డీజే సాధారణంగా మారిపోయాయి. వీటితో ఆనందంతో పాటు అవతలి వారికి అసౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించేలా పంజాబ్‌లోని బఠిండా జిల్లా బల్లా గ్రామ పెద్దలు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మద్యం, డీజే లేకుండా పెళ్లి చేసుకున్న వారికి రూ.21వేలు బహుమతిగా ఇస్తున్నారు. వృథా ఖర్చును తగ్గించేందుకే ఈ పథకం ప్రారంభించినట్లు సర్పంచ్ అమర్‌జిత్ కౌర్ తెలిపారు.

News January 7, 2025

బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలి: భట్టి

image

TG: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై Dy.CM భట్టి విక్రమార్క స్పందించారు. భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతలు ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆవేశంలో BJP కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు. దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.