News January 4, 2025
ఈ వీసాల గురించి తెలుసా?
అమెరికా వీసా అనగానే హెచ్1-బీ వీసాయే చాలామందికి గుర్తొస్తుంది. కానీ ఇది కాక చాలా రకాల వీసాలున్నాయి.
విద్యార్థులకు F-1(అమెరికా వర్సిటీల్లో డిగ్రీలు చదివేవారికి)
M-1(వొకేషనల్ కోర్సులు చదవాలనుకునేవారికి)
J-1(ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, రిసెర్చ్)
ఉద్యోగులకు L-1(సంస్థ తరఫున లభిస్తుంది)
O-1(పలు రంగాల్లో నిష్ణాతులకు)
P (అథ్లెట్లు, నటులు, కళాకారులకు)
EB1 నుంచి EB5 వరకు(పెట్టుబడి పెట్టేవారికి)
Similar News
News January 7, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 8 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
News January 7, 2025
టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ ఈవో
AP: తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి పది రోజుల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3వేల మంది పోలీసులు, 1500 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తామని తెలిపారు. టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.
News January 7, 2025
అందరూ వెళ్లిపోయారు.. కానీ మోదీ ఆట ఇంకా నడుస్తోంది: బీజేపీ
2014 నుంచి ఇప్పటి దాకా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఓడినవారు కొందరైతే, వివిధ కారణాలతో తప్పుకున్నవారు ఇంకొందరు. ఇలా మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక US మొదలుకొని ఆస్ట్రేలియా వరకు ఎందరో దేశాధినేతలు పదవుల నుంచి తప్పుకున్నారు. తాజాగా కెనడా PM జస్టిన్ ట్రూడో కూడా. దీంతో ‘అందరూ వెళ్లిపోయారు, కానీ PM మోదీ ఆట ఇంకా నడుస్తోంది. Ultimate Big Boss Energy!’ అంటూ BJP పేర్కొంది.