News January 4, 2025
HYD: లగచర్ల కేసులో సురేష్, శివ కస్టడీకి అనుమతి

లగచర్ల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన సూత్రధారి సురేష్ ,శివకు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మిగతా నిందితులకు సంబంధించి మాంగ్యా నాయక్, లోక్యా నాయక్ కస్టడీ విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇద్దరు నిందితుల తరుపున కౌంటర్ ధాఖలు న్యాయవాది వేశారు. కౌంటర్ పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.
Similar News
News January 17, 2026
మహబూబ్‌నగర్ జిల్లాకు నేడు CM రేవంత్

మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో మహబూబ్‌నగర్ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి రానుందని నిపుణులు అంటున్నారు.
News January 17, 2026
భూగర్భంలో JBS- శామీర్‌పేట మెట్రో..!

హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2లో భాగంగా జేబీఎస్(JBS) నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్ రహదారి మీదుగా సుమారు 17 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ నిర్మిస్తున్నారు. ఇది ఉత్తర హైదరాబాద్ ప్రయాణాన్ని సులభతరం చేసే కీలక ప్రాజెక్ట్. ఈ దారిలో ఉన్న హకీంపేట ఎయిర్ బేస్ రక్షణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఆర్మీ నిబంధనల ప్రకారం అక్కడ మెట్రోను పిల్లర్లపై కాకుండా భూగర్భంలో (<<18874590>>Underground<<>>) నిర్మించాల్సి వస్తోంది.
News January 17, 2026
HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.


