News January 4, 2025
హైదరాబాద్‌లో తప్పిన విమాన ప్రమాదం
TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే
Similar News
News January 7, 2025
టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ ఈవో
AP: తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి పది రోజుల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3వేల మంది పోలీసులు, 1500 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తామని తెలిపారు. టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.
News January 7, 2025
అందరూ వెళ్లిపోయారు.. కానీ మోదీ ఆట ఇంకా నడుస్తోంది: బీజేపీ
2014 నుంచి ఇప్పటి దాకా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఓడినవారు కొందరైతే, వివిధ కారణాలతో తప్పుకున్నవారు ఇంకొందరు. ఇలా మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక US మొదలుకొని ఆస్ట్రేలియా వరకు ఎందరో దేశాధినేతలు పదవుల నుంచి తప్పుకున్నారు. తాజాగా కెనడా PM జస్టిన్ ట్రూడో కూడా. దీంతో ‘అందరూ వెళ్లిపోయారు, కానీ PM మోదీ ఆట ఇంకా నడుస్తోంది. Ultimate Big Boss Energy!’ అంటూ BJP పేర్కొంది.
News January 7, 2025
రాష్ట్ర ప్రభుత్వాల ‘ఆర్థిక పరిమితుల’పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఏ పనీ చేయని వ్యక్తులకు ఉచితాలు ఇవ్వడానికి రాష్ట్రాల వద్ద డబ్బులు ఉంటాయని, అదే జడ్జిలకు జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే పరిమితులపై మాట్లాడుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఎన్నికలొస్తే మహిళలకు ₹2500 ఇస్తామంటూ పథకాలు ప్రకటిస్తారు. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థను ఏర్పరచాలంటే కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి న్యాయమూర్తుల ఆర్థిక స్వతంత్రత అనివార్యం’ అని జస్టిస్ గవాయ్ బెంచ్ పేర్కొంది.