News January 4, 2025

అకౌంట్లోకి రూ.20,000.. ఎప్పుడంటే?

image

AP: కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులకు వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1న వారి ఖాతాల్లో రూ.20,000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. నిన్న ONGC పైపులైన్ వల్ల నష్టపోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల మత్స్యకారులకు ఆ సంస్థ విడుదల చేసిన నష్టపరిహారాన్ని 23,450 మందికి రూ.63,200 చొప్పున పంపిణీ చేశారు.

Similar News

News January 7, 2025

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి

image

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు.

News January 7, 2025

ఇలా చేస్తే HAPPY LIFE మీ సొంతం

image

ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాల్లో నియంత్రణ అవసరం. జీవితాన్ని ఉత్తమంగా మార్చేందుకు ఈ 5Mను కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *MOUTH-ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. *MIND-ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. *MANNER- మర్యాదపూర్వక ప్రవర్తన. *MOOD- భావోద్వేగాల నియంత్రణ. *MONEY- ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ వంటివి పాటిస్తే జీవితం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నారు.

News January 7, 2025

తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సిఫార్సు

image

తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 2023 జులైలో రాష్ట్ర హైకోర్టు సీజేగా అలోక్ నియమితులయ్యారు. మరోవైపు బాంబే హైకోర్టు సీజే దేవేంద్ర కుమార్‌ను ఢిల్లీ HCకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.