News January 4, 2025

ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలోనే ఎయిర్ ఫోర్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడో మూతపడింది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు దగ్గరలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఏరియాలో 723 ఎకరాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబు నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

Similar News

News December 28, 2025

ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

image

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.

News December 28, 2025

తర్లుపాడు KGBV విద్యార్థులతో వంట పనులు

image

తర్లుపాడు మండలం కలుజువ్వులపాడు పంచాయతీలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్నట్లు ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలతో చపాతీలు చేయించడం, వంట సామాను కడిగించడం, గదులు శుభ్రంచేయించడం వంటి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు చెప్పాల్సిన సిబ్బంది పిల్లలతో చాకిరీ చేయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 28, 2025

ప్రకాశం కలెక్టర్‌‌తో MLA ఉగ్ర భేటీ.!

image

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్‌తో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తెలిపిన అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధికి సంబంధించిన అంశాలకు తన వంతు సహకరిస్తానని తెలిపారు.