News January 4, 2025

సంగం: హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరి మృతి

image

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన శనివారం సంగం మండలం వెంగారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 15, 2026

మన నెల్లూరులో ఏమంటారంటే..?

image

నేడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండగ ఇది. దీన్ని సంక్రాంతి అని, మకర సంక్రాంతి అని పొంగల్ అని మరికొందరు అంటారు. మన నెల్లూరు జిల్లాలో పెద్ద పండగ అంటారు. చనిపోయిన తల్లిదండ్రులకు తర్పణం వదులుతారు. వాళ్ల ఫొటోలు పెట్టి పూజలు చేస్తారు. ఉపవాసంతో నాన్ వెజ్ వండని పాత్రల్లో పవిత్రంగా ప్రసాదాలు చేసి సమర్పిస్తారు.

News January 15, 2026

కోవూరు : సంక్రాంతి అంటే మీకు తెలుసా..?

image

సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అతి పవిత్రమైన రోజు. దీనితో ఉత్తరాయన పుణ్య కాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను పెద్ద పండుగ అని అంటారు. దీనిని నువ్వులు, బెల్లంతో చేసే వంటకాలతో, రంగవల్లులతో పెద్దలకు నమస్కరించి కొత్త జీవితాన్ని స్వాగత్తిస్తూ కుటుంబసమేతంగా జరుపుకుంటారు. పండుగ విశిష్టత తెలిసినవారు కామెంట్ చేయండి.

News January 15, 2026

జిల్లాలోని 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ

image

జిల్లాలోని 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించబడిన 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ కలగనున్నట్లు డీడీఓ గుర్రప్ప తెలిపారు. బుధవారం ఢిల్లీకి చెందిన జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థ సహాయక సంచాలకులు సాయి ప్రదీప్‌తో ఆయన భేటీ అయ్యారు. నిర్మించిన గిడ్డంగులకు అక్రిడేషన్ పనులు వేగవంతంగా పూర్తయితే రైతుల పండించిన పంటల్లో గిడ్డంగులలో భద్రపరచుకోవచ్చన్నారు.