News January 4, 2025
నాకు ఆ తెలివి ఉంది: రోహిత్
జట్టు నుంచి తప్పుకుంటే రిటైర్మెంట్ తీసుకున్నట్లు కాదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ఓ మ్యాచ్‌కు దూరమైతే తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేనని అర్థం కాదు కదా అన్నారు. ఎవరో ల్యాప్‌టాప్ ముందో, పెన్ పట్టుకొని కూర్చొని తన రిటైర్మెంట్, కెప్టెన్సీ గురించి నిర్ణయించలేరని తెలిపారు. తాను సెన్సిబుల్ వ్యక్తినని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తనకు జీవితంలో ఎప్పుడు ఏం కావాలో నిర్ణయించుకునే తెలివి ఉందని చెప్పారు.
Similar News
News January 8, 2025
ప్రధాని రాకకోసం ఎదురుచూస్తున్నాం: సీఎం
AP పర్యటనకు వస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నట్లు సీఎం చెప్పారు.
News January 8, 2025
రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్
అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.
News January 8, 2025
చలికాలం మంచి నిద్ర కోసం ఏం తినాలంటే?
చలికాలంలో నిద్రపై మనం రాత్రి తినే ఆహారం ప్రభావం ఉంటుంది. సుఖవంతమైన నిద్ర కోసం మంచి ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండ్లు, చిలకడదుంప, అరటిపండ్లు తీసుకుంటే నిద్రకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనే తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని అంటున్నారు.