News January 4, 2025
సోషల్ మీడియా ఖాతాలకు కేంద్రం కొత్త రూల్!

దేశంలోని పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు ఇకపై పేరెంట్స్ అనుమతి తప్పనిసరి కానుంది. ‘డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం పేరెంట్స్ అనుమతిస్తేనే పిల్లల పర్సనల్ డేటాను సంస్థలు స్టోర్ చేయవచ్చు. ఒకవేళ రూల్స్ ఉల్లంఘిస్తే ఆ కంపెనీలకు ₹250కోట్ల వరకూ ఫైన్ ఉంటుంది. దీనిపై FEB18లోగా <
Similar News
News January 24, 2026
పులిపిర్లకు ఇలా చెక్

వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. అవి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అద్దితే పూర్తిగా తగ్గిపోతాయి. • ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. అలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.
News January 24, 2026
ఉద్యోగులకు షాక్.. డుమ్మా కొడితే ఇంటికే!

TG: డ్యూటీకి రెగ్యులర్‌గా రాని ప్రభుత్వ ఉద్యోగులపై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. పర్మిషన్ లేకుండా ఏడాదికి మించి విధులకు దూరంగా ఉంటే నేరుగా సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ‘తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్’ను మారుస్తూ CS ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా ఐదేళ్లు సెలవులో ఉన్నా, అనుమతి లేని ఫారిన్ సర్వీసులో కొనసాగినా వేటు తప్పదు. ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇస్తారు.
News January 24, 2026
కాఫీ పొడితో కళకళలాడే ముఖం

కాఫీ తాగడం వల్ల ఆరోగ్యప్రయోజనాలతో పాటు చర్మం కూడా మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు. కాఫీ పొడి ఫేస్ ప్యాక్‌లు వాడటం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. * స్పూన్ కాఫీపొడిలో తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ✍️మరిన్ని హెయిర్, స్కిన్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.


