News January 4, 2025

32,438 ఉద్యోగాలు.. BIG UPDATE

image

రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీలో విద్యార్హతల్లో రైల్వే బోర్డు మార్పులు చేసింది. టెన్త్/ITI/నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన జాతీయ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా పలు పోస్టులు భర్తీ చేస్తారు. ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News January 8, 2025

చలికాలం మంచి నిద్ర కోసం ఏం తినాలంటే?

image

చలికాలంలో నిద్రపై మనం రాత్రి తినే ఆహారం ప్రభావం ఉంటుంది. సుఖవంతమైన నిద్ర కోసం మంచి ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండ్లు, చిలకడదుంప, అరటిపండ్లు తీసుకుంటే నిద్రకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనే తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని అంటున్నారు.

News January 8, 2025

ప్రధానికి కృతజ్ఞతలు: శర్మిష్ట ముఖర్జీ

image

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్మారకచిహ్నం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తన కృతజ్ఞతల్ని తెలియజేశానని ఆమె ట్విటర్లో తెలిపారు. ‘నా మనస్ఫూర్తిగా పీఎంకు ధన్యవాదాలు. మేం అడగకపోయినా ప్రభుత్వం ఈ గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఏ మాత్రం ఊహించలేదు’ అని పేర్కొన్నారు.

News January 7, 2025

వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట

image

AP: మాజీ CM YS జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్‌పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు NOC ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.