News January 4, 2025
నేడు నేవీ విన్యాసాలు
AP: విశాఖ ఆర్కే బీచ్‌లో నేడు నేవీ సాహస విన్యాసాల(ఆపరేషన్ డెమో)ను ప్రదర్శించనుంది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహించి అదేరోజు సాహస విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈసారి(2024 DEC) ఒడిశాలో నేవీ డే నిర్వహించగా విశాఖ ప్రజల కోసం ఇవాళ సాయంత్రం ప్రదర్శన చేపట్టనున్నారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు వారి కుటుంబసభ్యులు సైతం హాజరుకానున్నారు.
Similar News
News January 8, 2025
ప్రధాని రాకకోసం ఎదురుచూస్తున్నాం: సీఎం
AP పర్యటనకు వస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నట్లు సీఎం చెప్పారు.
News January 8, 2025
రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్
అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.
News January 8, 2025
చలికాలం మంచి నిద్ర కోసం ఏం తినాలంటే?
చలికాలంలో నిద్రపై మనం రాత్రి తినే ఆహారం ప్రభావం ఉంటుంది. సుఖవంతమైన నిద్ర కోసం మంచి ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండ్లు, చిలకడదుంప, అరటిపండ్లు తీసుకుంటే నిద్రకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనే తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని అంటున్నారు.