News January 4, 2025

ఖమ్మం: ఆన్ లైన్ గేమ్స్‌తో ప్రాణాలు పోతున్నాయ్!

image

ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటున్నారు. కూసుమంచి మం. గైగోళ్ళపల్లికి చెందిన ఉపేందర్ ఆన్‌లైన్ గేమ్స్‌లో రూ.5 లక్షల వరకు పోగొట్టుకుని <<15051449>>బలవన్మరణానికి <<>>పాల్పడ్డాడు. ఆన్‌లైన్ గేమ్స్‌ ప్రమాదకరమని దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News January 8, 2025

ఖమ్మం: సంక్రాంతికి 1030 ప్రత్యేక బస్సులు: RM

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి 1030 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 14 వరకు హైదరాబాద్-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు 585, 15 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం-హైదరాబాద్‌కు 445 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సీట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 7, 2025

మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి..!

image

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అవుతుందనే ప్రచారంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఆశావహులు పండుగలు, పబ్బాలకు తాయిలాలు ఇస్తుండడమే కాక శుభ, అశుభ కార్యాల్లో స్థానికులతో మమేకమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 589 పంచాయతీల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తొంది. ఇప్పటికే నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి.

News January 7, 2025

30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాలకే: తుమ్మల

image

బడ్జెట్లో 30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరంలోనే రూ.73,000 కోట్లు రైతుల కోసం ఖర్చుపెట్టి దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికల కోడ్ వంకతో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు రూ.7,600 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిందని తుమ్మల అన్నారు.