News January 4, 2025

హోంమంత్రి అనిత పీఏపై వేటు!

image

AP: తన పీఏ సంధు జగదీశ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో హోంమంత్రి వంగలపూడి అనిత అతడిని విధుల నుంచి తొలగించారు. ఆయన పదేళ్లుగా మంత్రి వద్ద పనిచేస్తున్నారు. మంత్రి పేరు చెప్పి జగదీశ్ అక్రమ వసూళ్లకు తెరతీశారని, పార్టీ నాయకులతో దురుసుగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణ, తిరుమల సిఫార్సు లేఖలు, మద్యం దుకాణాల్లో వాటాలవంటి పలు అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.

Similar News

News January 8, 2025

‘దాదా’ స్మారకం: బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం

image

దేశ రాజ‌కీయాల్లో ‘దాదా’గా పేరొందిన‌ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్మార‌కం నిర్మాణం నిర్ణయం వెనుక BJP సొంత వ్యూహాలు ఉన్నాయన్నది పలువురి అభిప్రాయం. ఒకవైపు మ‌న్మోహ‌న్ స్మార‌కం కోసం కాంగ్రెస్ ప‌ట్టుబ‌డుతోంది. అయితే త‌న తండ్రి స్మార‌కం గురించి ఎందుకు అడ‌గ‌లేద‌ని ప్ర‌ణ‌బ్ కుమార్తె శర్మిష్ఠ గతంలో INCని ప్ర‌శ్నించారు. INC కూడా ప్ర‌ణబ్ స్మార‌కంపై మాట్లాడ‌లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్రం నిర్ణ‌యం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

News January 8, 2025

ప్రధాని రాకకోసం ఎదురుచూస్తున్నాం: సీఎం

image

AP పర్యటనకు వస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నట్లు సీఎం చెప్పారు.

News January 8, 2025

రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్

image

అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.