News January 4, 2025
చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?: జగన్
AP: వరుసగా క్యాబినెట్ భేటీలు జరుగుతున్నా ‘తల్లికి వందనం’ ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పట్లేదని ప్రభుత్వాన్ని YS జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎందరు పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఈ ఏడాదికి తల్లికి వందనం ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?’ అని ట్వీట్ చేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
Similar News
News January 8, 2025
ప్రధాని రాకకోసం ఎదురుచూస్తున్నాం: సీఎం
AP పర్యటనకు వస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నట్లు సీఎం చెప్పారు.
News January 8, 2025
రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్
అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్‌గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.
News January 8, 2025
చలికాలం మంచి నిద్ర కోసం ఏం తినాలంటే?
చలికాలంలో నిద్రపై మనం రాత్రి తినే ఆహారం ప్రభావం ఉంటుంది. సుఖవంతమైన నిద్ర కోసం మంచి ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండ్లు, చిలకడదుంప, అరటిపండ్లు తీసుకుంటే నిద్రకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనే తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని అంటున్నారు.