News March 17, 2024

నేటి చిలకలూరిపేట సభకు భారీ బందోబస్తు

image

నేడు చిలకలూరిపేటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా, గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు పర్యవేక్షణలో వీవీఐపి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. ప్రజాగళం సభకు 3900 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో ఆరుగురు ఎస్పీలు, 11 మంది అడిషనల్ ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు ఉన్నారన్నారు. పోలీసులకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా మెలగాలని సూచించారు.

Similar News

News November 21, 2024

గుంటూరు జిల్లా ప్రజలకు ఎస్పీ ముఖ్య గమనిక

image

ఎవరైనా సాధారణ (లేదా) ఆన్‌లైన్ యాప్స్(Whatsapp, Telegram, Skype) ద్వారా కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటే భయపడవద్దని ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. డిజిటల్ అరెస్టు పట్ల అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

News November 21, 2024

ఈపూరులో విషాదం.. ఇద్దరు పిల్లలతో కాలువలో దూకిన వ్యక్తి

image

పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈపూరు మండలంలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆరేపల్లి ముప్పాళ్ళ వద్ద సాగర్ కెనాల్‌ పెద్ద కాలువలో దూకాడు. ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2024

కౌలు రైతుల సమస్యలపై మండలిలో ప్రశ్నించిన MLC కేఎస్

image

కౌలు రైతులకు రుణాలు అందకపోవడం అనేది సామాజిక సమస్య అని గుంటూరు, కృష్ణా పట్టభధ్రుల MLC లక్ష్మణరావు శాసనమండలిలో అన్నారు. APలో 26 లక్షల మంది కౌలు రైతులున్నారని చెప్పారు. భూయజమాని సంతకం ఉంటేనే రుణ అర్హత కార్డులు ఇస్తామనే నిబంధనతో చాలామంది నష్టపోతున్నారని చెప్పారు. భూమి మీద యజమానికి, పంట మీద కౌలు రైతుకి రుణాలు ఇవ్వడం మంచిదని సూచించారు. కులాన్ని బట్టి కాకుండా రైతులందరికీ రుణ అర్హత కార్డులివ్వాలన్నారు.