News March 17, 2024
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28982 మంది ప్రైవేటు విద్యార్థులు 1592 మంది హాజరు కానున్నట్లు చెప్పారు.
Similar News
News April 4, 2025
ఎచ్చెర్ల: 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు

Dr.BR.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అఫిలియేషన్ డిగ్రీ కళాశాలల 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూజీ ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు వివరాలు వెల్లడించారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 54 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విధానంలో 9,000 మంది వరకు పరీక్షలకు హాజరు కానున్నారు.
News April 4, 2025
నరసన్నపేట: లారీ యాక్సిడెంట్.. తాపీమేస్త్రి మృతి

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ తాపీమేస్త్రి మృతి చెందారు. నరసన్నపేట మండలం పొలాకి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు(49) మధురవాడలో మరో వ్యక్తితో పని నిమిత్తం బైక్‌పై బయలుదేరారు. మారికవలస హైవేపై ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న ప్రభాకర్ రావు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
News April 4, 2025
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన డీఎంఅండ్‌హెచ్‌ఓ

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై గురువారం ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ బాలమురళీకృష్ణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బీవీవీ రమణమూర్తి గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ మెడికల్ లీవ్‌లో ఉంది. ఆమె తిరిగి విధుల్లో చేరేందుకు లంచం అడగడంతో ఏసీబీని ఆమె ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.