News March 17, 2024
ప్రకాశం: నేటి నుంచి స్పందన కార్యక్రమం రద్దు

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాతోపాటు మండలాల్లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలోనూ కోడ్ అమలులోకి వచ్చిందని, అందువల్ల స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News March 6, 2026
10th విద్యార్థులకు RTC బస్సుల్లో ఉచితం: మార్కాపురం DM

మార్కాపురంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి సంస్థ అనుమతించినట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి తిరిగి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కండక్టర్‌కు బస్సు పాస్‌తో సంబంధం లేకుండా హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందన్నారు.
News March 5, 2026
మార్కాపురం: ప్రియురాలు పిలిచిందని వచ్చి దొరికాడు.!

మార్కాపురానికి చెందిన వ్యక్తిపై గుంటూరులో దాడి జరిగింది. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో ఉండటం ఇష్టం లేని వివాహిత ఆమె ప్రియుడు నాగసాయికృష్ణకు చెప్పింది. ఈ క్రమంలో నాగసాయికృష్ణ మార్కాపురం నుంచి గుంటూరు వచ్చాడు. విషయం తెలుసుకున్న వివాహిత భర్త దినకర్ మరికొందరితో కలిసి నాగసాయికృష్ణపై కర్రలతో దాడిచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 5, 2026
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..

ప్రకాశం(D)లో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. V.Vపాలెం (M) పోలినేనిపాలెంకి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి విప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరుకుంట వద్ద అన్నం తిని మంచినీటి కోసం శ్రీకాంత్ బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.


