News January 4, 2025

రోహిత్ శర్మపై విమర్శలు.. సినీ హీరో ఆగ్రహం!

image

ఫామ్ లేమితో జట్టు నుంచి స్వయంగా తప్పుకున్న రోహిత్ శర్మను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ప్రశంసించారు. ‘ప్రతి ఆటగాడికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. భారత క్రికెట్‌కు ఎంతో చేసిన కెప్టెన్‌ను విమర్శించడం తగదు. నిస్వార్థంగా జట్టు గురించి ఇలా ఎవరైనా ఆలోచించగలరా? స్ట్రాంగెస్ట్ హార్ట్, మైండ్ ఉన్నవాళ్లే ఇలా చేస్తారు. అలాంటి వారే గొప్ప లీడర్లు. రోహిత్ మిమ్మల్ని మళ్లీ గ్రౌండ్‌లో చూస్తాం’ అని పోస్ట్ పెట్టారు.

Similar News

News January 8, 2025

ఆరోగ్యశ్రీపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష?: వైఎస్ జగన్

image

AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

News January 8, 2025

షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్.. పాస్‌పోర్ట్ రద్దు

image

మాజీ PM షేక్ హసీనా పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్ల సమయంలో కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడ్డారంటూ ఆమెతోపాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. FEB 12లోగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. బంగ్లాలో అల్లర్ల సమయంలో పారిపోయిన వచ్చిన హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు.

News January 8, 2025

అదృష్టం అంటే ఈ బాలుడిదే..!

image

చెత్తకుప్పలో దొరికిన చిన్నారి భవితవ్యం మారిపోయింది. లక్నోకు చెందిన రాకేశ్‌ను మూడేళ్ల క్రితం ఎవరో చెత్తకుప్పలో పడేశారు. స్థానికులు గుర్తించి శిశు సంర‌క్ష‌ణ కేంద్రంలో చేర్చారు. తరచూ లక్నోకు వచ్చివెళ్తున్న అమెరికన్ దంపతులు బాలుడి విషయం తెలుసుకొని ద‌త్త‌త తీసుకున్నారు. పాస్‌పోర్టు ప్రక్రియ పూర్తవగానే బాలుడిని వారు US తీసుకెళ్ల‌నున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి USలో పెద్ద సంస్థ‌కు CEO అని తెలుస్తోంది.