News March 17, 2024
కర్నూలు: ఈనెల 20న సీఎం జగన్ రాక

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న సీఎం జగన్ ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఆలూరు నియోజకవర్గంలో రెండు దఫాలుగా వైసీపీ విజయం సాధిందించి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కాదని విరుపాక్షికి టికెట్ కేటాయించడంతో మూడోసారి వైసీపీ జెండా ఎగరాలని సీఎం పర్యటిస్తున్నట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.
Similar News
News March 31, 2026
కర్నూలు చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కర్నూలు చేరుకున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి, ఎస్పీ, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, గెస్ట్ హౌస్ నుంచి నేరుగా కలెక్టరేట్ సమావేశానికి పయనమయ్యారు. జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

News March 30, 2026
కర్నూల్: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికకు 98 వినతులు

కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లావ్యాప్తంగా 98 వినతులు అందాయి. ఉద్యోగాల పేరిట మోసాలు, ఆర్థిక వివాదాలు, కుటుంబ సమస్యలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.