News January 4, 2025

మణిపుర్ మిలిటెంట్లకు ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్!

image

మణిపుర్ మిలిటెంట్లు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ‘స్టార్ లింక్’ ఉపగ్రహం నుంచి వచ్చే ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో స్టార్ లింక్ ఇంటర్నెట్‌కు అనుమతి లేకపోయినా వారు వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్‌కు యాక్సెస్ ఉంది. కాగా గతేడాది మణిపుర్‌లో అల్లర్లు చెలరేగినప్పటి నుంచి అక్కడ కేంద్రం ఇంటర్నెట్ బంద్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 8, 2025

26న ట్రాక్టర్ మార్చ్‌కి రైతుల పిలుపు

image

పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులు ఈనెల 26న దేశవ్యాప్త ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ సహా ఇతర డిమాండ్ల సాధనకు రైతులంతా మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. కాగా రైతునేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ సరిహద్దులో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్రం దిగొచ్చేవరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా వేలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్నారు.

News January 8, 2025

MHలో అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

image

మహరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది APR 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అటు ‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్’ విధానాన్ని NHAI పకడ్బందీగా అమలు చేస్తోంది. ఒకే ఫాస్టాగ్ మల్టిపుల్ వెహికల్స్‌కు వాడటం, పలు పాస్టాగ్‌లు ఒకే వాహనానికి వినియోగించడాన్ని అరికట్టడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

News January 8, 2025

సుప్రీంకు వెళ్లినా కేటీఆర్ తప్పించుకోలేడు: మహేశ్ కుమార్

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లినా తప్పించుకోలేడని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధమన్న కేటీఆర్ ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అటు ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.