News January 4, 2025
రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: WGL కలెక్టర్

జిల్లాలో ప్రజలకు రహాదారి భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు.
Similar News
News December 30, 2025
యూరియా సరఫరాపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

యూరియా సరఫరాపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి 2025-26లో 1,12,345 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయన్నారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
News December 29, 2025
వరంగల్: యూరియా యాప్ డౌన్..!

జిల్లా రైతులకు యూరియా యాప్ సరిగా పని చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ఓపెన్, డేటా లోడ్ కాకపోవడంతో యూరియా నమోదు, స్లిప్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్య వల్ల ఎరువుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రైతులు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News December 29, 2025
WGL: యూరియాకు క్యూలైన్లు.. యాప్‌తో బుకింగ్ ముద్దు.!

వరంగల్ జిల్లాలో సోమవారం నుంచి యూరియా యాప్ అమలులోకి రానుంది. రైతులు ప్లే స్టోర్‌లో “Fertilizer Booking App” డౌన్‌లోడ్ చేసుకుని, తమ పంట వివరాలను నమోదు చేయడంతో యూరియాను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ సత్య శారద తెలిపారు. బుకింగ్ చేసుకున్నాక, వచ్చే ఐడీ 24 గంటల వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రక్రియపై రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు.


