News January 4, 2025
BCCI: జైషా వారసుడిగా దేవజిత్ సైకియా!
BCCI సెక్రటరీగా దేవజిత్ సైకియా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. DEC 1న ICC ఛైర్మన్‌గా జైషా వెళ్లిపోయాక సైకియా తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. SAT 4PMకు గడువు ముగిసేలోపు మరెవ్వరూ నామినేషన్లు వేయకపోవడంతో ఆయన ఎంపిక లాంఛనమే. ఇక ట్రెజరర్ స్థానానికి ఛత్తీస్‌గఢ్ క్రికెట్ సంఘం సభ్యుడు ప్రభుతేజ్ భాటియా ఎంపికవ్వనున్నారు. ఆశీశ్ షెలార్‌కు మహారాష్ట్రలో మంత్రి పదవి దక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది.
Similar News
News January 8, 2025
MHలో అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
మహరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది APR 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అటు ‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్’ విధానాన్ని NHAI పకడ్బందీగా అమలు చేస్తోంది. ఒకే ఫాస్టాగ్ మల్టిపుల్ వెహికల్స్‌కు వాడటం, పలు పాస్టాగ్లు ఒకే వాహనానికి వినియోగించడాన్ని అరికట్టడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
News January 8, 2025
సుప్రీంకు వెళ్లినా కేటీఆర్ తప్పించుకోలేడు: మహేశ్ కుమార్
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లినా తప్పించుకోలేడని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధమన్న కేటీఆర్ ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అటు ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
News January 8, 2025
విడాకుల రూమర్లు.. చాహల్ పోస్ట్ వైరల్
భార్య ధనశ్రీతో క్రికెటర్ చాహల్ విడాకుల రూమర్లకు ఇంకా తెరపడటం లేదు. దీనిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. అయితే తాజాగా చాహల్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అన్ని శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని వినేవారికి అది ఎంతో అందమైన మెలోడిలా అనిపిస్తుంది’ అన్న సోక్రటీస్ మాటలను కోట్ చేశారు. దీంతో చాహల్ పోస్ట్‌కు అర్థమేమై ఉంటుందని అతడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.