News January 4, 2025

ఆసీస్‌కు 200 టార్గెట్ సరిపోదేమో: గవాస్కర్

image

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు 200 టార్గెట్ సరిపోదేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘బుమ్రా తిరిగి మైదానంలో అడుగు పెడితేనే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. ఆయన లేకపోతే 200 లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేం. ప్రస్తుతం బుమ్రా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు ఊహకు అందకుండా బుమ్రా హెల్త్ అప్డేట్‌ను సీక్రెట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 26, 2025

ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

image

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.

News December 26, 2025

డీలిమిటేషన్‌: GHMCలో కొత్తగా 6 జోన్లు

image

TG: GHMC డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లను కొత్త జోన్లుగా పేర్కొంది.

News December 26, 2025

మతపరమైన గొడవ కాదు.. అతడో క్రిమినల్: బంగ్లా సర్కార్

image

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు <<18670618>>అమృత్ మండల్<<>> హత్యకు గురికావడంపై అక్కడి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘ఇది మతపరంగా జరిగిన ఘర్షణ కాదు. అమృత్ మండల్ ఓ టాప్ క్రిమినల్. అతను ఓ ఏరియాలో డబ్బులు డిమాండ్ చేసేందుకు రాగా స్థానికులతో జరిగిన గొడవలో చనిపోయాడు’ అని పేర్కొంది. కాగా దీపూ చంద్రదాస్ హత్య తర్వాత మరో హిందూ హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.