News January 5, 2025

నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్: హరీశ్ రావు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. రైతుభరోసా ఒక విడతలో ఎకరానికి రూ.7,500 ఇస్తామని, ఇప్పుడు రూ.6,000కు కుదించడం దారుణమన్నారు. ‘రైతుభరోసాను రైతు గుండెకోతగా మార్చారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ఠ. దారుణంగా దగా చేసిన సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుభరోసా కూడా చెల్లించాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.

Similar News

News February 5, 2025

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్

image

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ChatGPT సేవల కోసం ఇప్పటికే 18002428478 నంబర్‌ను తీసుకురాగా ఇప్పుడు సేవల పరిధిని పెంచింది. ప్రస్తుతం టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రమే రిప్లైలు ఇస్తూ ఉండగా ఇకపై ఆడియో, ఫొటో ఇన్‌పుట్స్‌కూ సమాధానాలు ఇవ్వనుంది. ఆ ఫొటో/వాయిస్ నోట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ChatGPT స్పందిస్తుంది. ఆ నంబర్‌ను సేవ్ చేసుకుని మనకు కావాల్సిన ప్రశ్నలకు ఆన్సర్లు తెలుసుకోవచ్చు.

News February 5, 2025

క్లాస్‌రూమ్‌లో విద్యార్థితో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం

image

బెంగాల్‌లోని వర్సిటీలో మహిళా ప్రొఫెసర్ విద్యార్థితో క్లాస్‌రూమ్‌లో <<15302833>>పెళ్లి చేసుకోవడం<<>> వైరలైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అధికారులు సెలవుపై పంపారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ రాజీనామా లేఖను రిజిస్ట్రార్‌ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై వర్సిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా ఆ పెళ్లి ఓ ప్రాజెక్టులో భాగమని ప్రొఫెసర్ చెబుతున్నారు.

News February 5, 2025

నేడు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

image

TG: BC కులగణన, SC వర్గీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష BRS విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై కాంగ్రెస్ సర్కారు వివరణ ఇవ్వనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సబ్ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!