News January 5, 2025
మారుతి 40 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన టాటా
గత ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ మోడల్‌గా టాటా పంచ్ నిలిచింది. 2024లో 2.02 లక్షల పంచ్ మోడల్ కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మారుతి వ్యాగన్ R, ఎర్టిగా, బ్రెజా, హ్యుండాయ్ క్రెటా ఉన్నాయి. కాగా 1985-2004 వరకు మారుతి 800, 2005-2017 వరకు మారుతి ఆల్టో, 2018లో డిజైర్, 19లో ఆల్టో, 2020లో స్విఫ్ట్, 2021-22లో వ్యాగన్ R, 2023లో స్విఫ్ట్ ఎక్కువగా అమ్ముడైన కార్లుగా ఉన్నాయి.
Similar News
News January 8, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదేనా!
వచ్చే నెల 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకొని షమీ తిరిగి జట్టులో చేరనున్నట్లు సమాచారం. CTలో భారత్ తొలి మ్యాచ్ FEB 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్‌తో ఆడనుంది.
జట్టు అంచనా: రోహిత్(C), కోహ్లీ, గిల్, జైస్వాల్, శ్రేయస్, రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, షమీ, అర్ష్‌దీప్.
News January 8, 2025
సంక్రాంతి సెలవులు.. ఎవరికి ఎన్నిరోజులంటే?
ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై కాస్త గందరగోళం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు హాలిడేస్ ఎప్పుడనే వివరాలు చూద్దాం.
* TGలో స్కూళ్లకు ఈనెల 11-17 వరకు
* జూనియర్ కాలేజీలకు 11-16 వరకు
* APలో స్కూళ్లకు ఈనెల 10-19 వరకు
* క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 11-15 వరకు
* జూనియర్ కాలేజీలకు ఇంకా సెలవులు ప్రకటించలేదు.
News January 8, 2025
రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!
AP: వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.