News January 5, 2025

చండ్రుగొండ: టెన్త్ విద్యార్థి మృతి

image

పురుగు మందు తాగి టెన్త్ విద్యార్థి మృతి చెందిన ఘటన జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాల్యతండాకు చెందిన చరన్ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. జనవరి 1న కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లలేదని కుటుంబ సభ్యులు మందలించగా.. చరణ్ పురుగు మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ పాపారావు కేసు నమోదు చేశారు.

Similar News

News January 8, 2025

ఖమ్మం: పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్

image

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI వివరాల ప్రకారం.. KMM జిల్లా కామేపల్లి మండలం రేపల్లేవాడకు చెందిన నెహ్రూ(23) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. కాగా, వీరి పెళ్లికి యువతి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఈ నెల 3న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News January 8, 2025

ఖమ్మం: సంక్రాంతికి 1030 ప్రత్యేక బస్సులు: RM

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి 1030 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు HYD-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు 585, 15 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం-HYDకు 445 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సీట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 8, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ∆} కరకగూడెంలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} పెనుబల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే