News January 5, 2025

విశాఖ: దూరవిద్య డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ

image

ఏయూ దూరవిద్య డిగ్రీ కోర్సుల పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ విజయ మోహన్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్‌ టేబుల్ అందుబాటులో ఉంటుందన్నారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయని అన్నారు.

Similar News

News March 3, 2026

విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.

News March 3, 2026

రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

image

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.

News March 3, 2026

విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

image

ఆర్కే‌బీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.