News January 5, 2025

NLG: స్థానిక పోరుకు సన్నద్ధం…

image

NLG జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.

Similar News

News January 8, 2025

NLG: ప్రాణాలు తీస్తున్న పొగమంచు!

image

వెన్నులో వణుకు పుట్టించే చలికి పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉ. 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై వాహనాలు కనిపించక పరస్పరం ఢీకొని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇటీవల నల్గొండలో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

News January 8, 2025

చైనా మాంజా వాడకం నిషేధం: నల్గొండ ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేధించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజా చాలా ప్రమాదకరమని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. పతంగులకు నైలాన్, సింథటిక్‌తో చేసిన చైనా మాంజా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరదా కోసం చేసే ఈ పని ప్రాణాల మీదకు తెస్తుందన్నారు. 

News January 7, 2025

NLG: మెస్ మెనూపై అధికారుల స్పందన 

image

ఎంజీ యూనివర్శిటీ కృష్ణవేణి వసతి గృహంలో విద్యార్థినులకు గొడ్డుకారం పెట్టిన ఘటనపై విశ్వవిద్యాలయ అధికారులు స్పందించారు. హాస్టల్స్ డైరెక్టర్ డా.దోమల రమేష్, డిప్యూటీ డైరెక్టర్ డా సాంబారు కళ్యాణి నేతృత్వంలో వార్డెన్లు రాజేశ్వరి, డా.జ్యోతి ప్రత్యక్షంగా వసతి గృహానికి వెళ్లి పరిశీలించారు. విద్యార్థినుల భాగస్వామ్యంతో వారి నచ్చిన మెనూ ప్రకారమే నిర్వహణ జరుగుతుందని తెలిపారు.