News January 5, 2025
నెల్లూరు జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన్నెమాల

వైసీపీ నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిడూరుకు చెందిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అభివృద్ధికి మన్నెమాల ఎంతో కృషి చేసి చేశారని, గ్రామంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడని సన్నిహితులు తెలిపారు. దీంతో అధిష్ఠానం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పదవినిచ్చినట్లుగా నాయకులు తెలిపారు.
Similar News
News March 3, 2026
నెల్లూరు: ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు

తన వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పి తనను శారీరకంగా బలవంతంగా వాడుకొని మోసం చేశాడని విడవలూరుకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడవలూరు మన్మధరావుపేటకు చెందిన చంచల ప్రవీణ్ కుమార్ ప్రేమ పేరుతో తనను బలవంతంగా వాడుకుని తన బంధువులు వారి తల్లిదండ్రులను పెళ్లి చేసుకోవాలని అడిగితే అవమానించారని విడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News March 3, 2026
నెల్లూరు: స్పెషల్ డ్రైవ్ పెడుతున్నా.. శృతి మించుతున్నారు

జిల్లాలో పోలీసులు ఎప్పటికప్పుడు నాకా బందీలు చేపడుతున్నా.. ఎక్కడికక్కడ శృతి మించుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన పలు సందర్బల్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా.. 57 లాడ్జిలను, 1694 వాహనాలను తనిఖీ చేయగా.. 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో 28 మంది పట్టుబడ్డారు. నిభందనలు పాటించనివారిపై 157 కేసులు నమోదు చేశారు. రూ. 1.52 లక్షలు జరిమానా విధించారు.
News March 2, 2026
నెల్లూరు: చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కోవూరు(m), పాటూరుకు చెందిన పవన్ సాయి(19) గంగవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 27న తన ఇంట్లోనే గడ్డి ముందు సేవించాడు. వాంతులు రావడంతో గమనించిన తండ్రి చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


