News January 5, 2025
గుంటూరు: పోలీసులమని బెదిరించి.. బట్టలు విప్పించి..
పోలీసులమని బెదిరించి ఓ వ్యక్తితో దుస్తులు ఇప్పించడంతో పాటూ నగదు దోచుకున్న ఘటన నగరంపాలెం స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని ఆపి మెడికల్ కాలేజ్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పించారు. జేబులో మత్తుపదార్థాలున్నాయి, కేసు నమోదు చేస్తామని బెదిరించారు. బాధితుడి వద్ద ఫోన్ లేకపోవడంతో అతని సోదరుడికి ఫోన్ చేయించి ఐదు వేలు కొట్టించుకున్నారు.
Similar News
News January 8, 2025
భర్తను చంపేందుకు భార్య పన్నాగం.. అరెస్ట్
మంగళగిరి పరిధి యర్రబాలెంకు చెందిన వివాహిత తన భర్తను చంపేందుకు తన ప్రియునితో కలిసి పథకం వేసినట్లు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రూరల్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. వివాహిత కుక్క పిల్లలను అమ్ముతూ ఉంటుందని ఈ క్రమంలో విజయవాడకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తన భర్తను చంపేందుకు ఓ రౌడీ షీటర్ సహాయం తీసుకున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపామన్నారు.
News January 7, 2025
గుంటూరు: మద్యం జోలికి వెళ్లని గ్రామమది..
పొన్నూరు(M) వెల్లలూరు ఒకనాడు ఫ్యాక్షనిజంతో అట్టుడికేది. అలాంటి గ్రామం నేడు మహనీయుడు విశ్రాంత న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు ఆశయాలకు అనుగుణంగా మద్యానికి దూరంగా ఉంటూ గ్రామస్వరాజ్యం వైపు అడుగులు వేస్తోంది. 15ఏళ్ల క్రితం వరకు గ్రామంలో స్వల్ప కారణాలతో చంపుకునే వరకు వెళ్లేవారు. ఇది చూసి చలించిన లక్ష్మణరావు గ్రామ ప్రజలతో సమావేశమై మద్యపాన నిషేధానికి నాంది పలికారు. ఆనాటి నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు లేవు.
News January 7, 2025
లోకేశ్ సమక్షంలో సుజ్లాన్-ఏపీఎస్ఎస్డీసీ అవగాహన ఒప్పందం
ఏపిలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు ఎంఓయు చేసుకున్నారు. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసెన్సింగ్ వంటి కీలక రంగాల్లో 12వేలమందికి శిక్షణ ఇస్తారు.