News March 17, 2024

విశాఖ: పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డీసీఎం ఏకె. త్రిపాఠి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 28వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ- గుంటూరు- (22701), గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖ- మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. మరికొంటిని దారి మళ్లించారు.

Similar News

News November 27, 2024

IPLకు అనకాపల్లి జిల్లా యువకుడు.. నేపథ్యం ఇదే

image

అనకాపల్లి జిల్లా కుర్రాడు పైలా అవినాశ్‌ని IPL వేలంలో పంజాబ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అచ్యుతాపురం మండలానికి చెందిన అవినాశ్ సత్యారావు, నాగమణిల చిన్న కొడుకు. వీరది వ్యవసాయ ఆధారిత కుటుంబం కాగా అవినాశ్‌కు క్రికెట్‌ మీద ఉన్న మక్కువ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసిన అవినాశ్ రంజీల్లో సత్తా చాటాడు. దీంతో పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తీసుకుంది.

News November 27, 2024

విశాఖలో మొదలైన రైల్వే యూనియన్ ఎన్నికల హడావుడి 

image

రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న రైల్వే యూనియన్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్‌ను గెలిపించాలని ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ విశాఖ రైల్వే ఉద్యోగులను కోరారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల బోనస్ కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ చేసిన పోరాట విజయాలను వివరించారు.

News November 26, 2024

విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటుపై సంతకాల సేకరణ

image

విశాఖ హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు బెంచి సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వీనర్, న్యాయవాది ఐఎం.అహమ్మద్, కోకన్వీనర్ గుడిపల్లి సుబ్బారావు ఆద్వర్యంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం విశాఖలో హైకోర్టు బెంచి ఏర్పాటు అవశ్యకతపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మోహన్, ఐఎఎల్ రాష్ట్ర అద్యక్షులు సురేశ్ కుమార్ పాల్గొన్నారు.