News January 5, 2025
వారంలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు
TG: రాష్ట్రంలో త్వరలో జూనియర్ లెక్చరర్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండేళ్ల కిందటే 1392 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్‌కు అప్పగించింది. మల్టీజోన్-1లో 581 మంది, జోన్-2లో 558 మంది ఉన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాగా వీరికి వారంలోగా నియామక పత్రాలు ఇచ్చి కాలేజీల్లో భర్తీ చేయనున్నారు.
Similar News
News January 8, 2025
రాబోయే 5 రోజులు జాగ్రత్త!
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా ఉంటోంది. రాబోయే 5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని IMD తెలిపింది. సంగారెడ్డి, కొమురం భీమ్ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు, HYD సహా ఇతర జిల్లాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
News January 8, 2025
విశాల్ ఆరోగ్యంపై నటి కుష్బూ క్లారిటీ
విశాల్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ నటి కుష్బూ క్లారిటీ ఇచ్చారు. ‘11 ఏళ్ల తర్వాత తన ‘మదగజరాజు’ మూవీ రిలీజ్ అవుతుందని డెంగ్యూతో బాధపడుతున్నా విశాల్ ఈవెంట్‌కు వచ్చారు. 103డిగ్రీల టెంపరేచర్ కారణంగా వణికారు. ఈవెంట్ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా కోలుకుంటున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు’ అని నటి అసహనం వ్యక్తం చేశారు.
News January 8, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,566 మంది దర్శించుకోగా, 16,021 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, తిరుమల నుంచి మహాకుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు శ్రీవారి రథం బయల్దేరింది.