News January 5, 2025
దివ్యాంగ విద్యార్థులకు నేరుగా అకౌంట్లలోనే పింఛన్: మంత్రి డోలా
AP: దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. వారికి ప్రతినెలా పింఛన్‌ను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్‌లో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2025
నేను వచ్చేలోపు వాళ్లను వదిలేయాలి: ట్రంప్ వార్నింగ్
గాజాలోని హమాస్ లీడర్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రమాణస్వీకారం చేసే సమయానికి (జనవరి 20) ముందే బందీలను వదిలిపెట్టాలని స్పష్టం చేశారు. లేదంటే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు. కాగా అమెరికా బందీలను విడిచిపెట్టేందుకు అగ్రరాజ్య ప్రతినిధులతో హమాస్ చర్చలు కొనసాగుతున్నాయి.
News January 8, 2025
హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు!.. అందరూ డిశ్చార్జ్!
HYDలో గతేడాది DECలోనే hMPV కేసులు నమోదైనట్లు ఓ ప్రైవేట్ ల్యాబ్ వెల్లడించింది. 258 మందికి శ్వాసకోశ వైద్య పరీక్షలు చేయగా 11 శాంపిల్స్‌లో hMPV పాజిటివ్ అని తేలిందని మణి మైక్రో బయాలజీ ల్యాబ్ తెలిపింది. వారు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ఈ వైరస్ కొత్తదేం కాదని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. hMPV ఇండియాలో ఎప్పటి నుంచో ఉందని ICMR కూడా వెల్లడించిందని వివరించింది.
News January 8, 2025
లోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్
లోన్లపై వడ్డీరేట్లకు సంబంధించి కస్టమర్లకు HDFC ఉపశమనం కలిగించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా లోన్లపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం HDFC MCLR 9.15% నుంచి 9.45% వరకు ఉన్నాయి. సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. MCLRను బట్టే బ్యాంకులు వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.