News March 17, 2024

పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేలా పోలీస్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.పరీక్షా కేంద్రాలు వద్ద జన సమూహాలు ఉండకూడదన్నారు.

Similar News

News April 4, 2025

కంచరపాలెంలో వివాహిత ఆత్మహత్య

image

విశాఖలో వివాహిత దేవి గురువారం ఆత్మహత్య చేసుకుంది.  చీకటి దేవి(30)కి  8 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొని ముగ్గురు పిల్లలతో కంచరపాలెంలో తన తల్లి దగ్గరే ఉండేది. ఏడాది క్రితం కలహాల కారణంగా పిల్లలను తల్లి దగ్గరే వదిలి తను వేరేగా ఉంటోంది. ఆ ప్రాంతంలోనే ఓ షాపులో పనిచేస్తూ దేవి రసాయనాలు తాగి స్పృహ కోల్పోయింది. కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News April 4, 2025

విశాఖ: 20 బైక్‌లు సీజ్

image

విశాఖలో ట్రాఫిక్ పోలీసులు 20 బైక్‌లను సీజ్ చేశారు. ఇన్‌ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు NAD, మద్దిలపాలెం ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టారు. వాహనం నడిపేవారు, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా మొదటిసారి దొరికిన వారి లైసెన్స్ 3 నెలలు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి దొరికిన వారి వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

News April 4, 2025

వీఎంఆర్డీఏలో 113 మందికి ప్లాట్ల కేటాయింపు

image

V.M.R.D.A. అధికారులు ఎంఐజి లే అవుట్లోని ప్లాట్లకు గురువారం డ్రా నిర్వహించారు. అడ్డూరు, గరివిడి, పాలవలసల్లో 113 మందికి ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయించారు. అడ్డూరులో 146, గరివిడిలో 212, పాలవలసలో 472 ప్లాట్లను V.M.R.D.A. అభివృద్ధి చేసింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నారు.

error: Content is protected !!