News January 5, 2025
నలుగురు నక్సల్స్ హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌లో నక్సల్స్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ హతం కాగా, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. శనివారం సాయంత్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో కాల్పులు ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో నాలుగు నక్సల్స్ మృతదేహాలను గుర్తించిన పోలీసులు AK-47తో సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Similar News
News January 8, 2025
టాటా సుమో మళ్లీ వస్తోంది!
1990, 2000ల్లో విపరీతమైన ఆదరణ పొందిన టాటా సుమో మళ్లీ వచ్చే అవకాశముంది. ఈ సంవత్సరం టాటా మోటార్స్ ఈ వాహనాన్ని రీలాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచి ఆధునాతన ఫీచర్లతో ఈ SUVని రూపొందించనున్నట్లు సమాచారం. ధర రూ.10-15 లక్షలుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది. కాగా టాటా సుమో తొలి మోడల్ 1994లో వచ్చింది.
News January 8, 2025
వారి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంపు
AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
News January 8, 2025
సీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000: KTR
TG: నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ కృష్ణవేణి హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం పెట్టారని వచ్చిన ఆరోపణలపై KTR స్పందించారు. ‘ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000 మాత్రమే. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారు. వారెవ్వా ప్రజాపాలన. శభాష్ ఇందిరమ్మ రాజ్యం’ అని ట్వీట్ చేశారు. కాగా అల్పాహారంలో విద్యార్థినులకు గొడ్డు కారం పెట్టారని పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.