News January 5, 2025

4 లక్షల పాస్‌పోర్టుల జారీనే లక్ష్యం

image

AP:పాస్‌పోర్టుల జారీని మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి శివ హర్ష తెలిపారు. 2024-25లో 3.23 లక్షల పాస్‌పోర్టులు అందించామని, 2025-26లో 4 లక్షల పాస్‌పోర్టులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. VJY, TPTY పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 13 పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో రోజుకు 1800 అపాయింట్‌మెంట్స్ ఇస్తున్నామన్నారు.

Similar News

News January 8, 2025

సీఎం ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000: KTR

image

TG: నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ కృష్ణవేణి హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం పెట్టారని వచ్చిన ఆరోపణలపై KTR స్పందించారు. ‘ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000 మాత్రమే. కానీ చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారు. వారెవ్వా ప్రజాపాలన. శభాష్ ఇందిరమ్మ రాజ్యం’ అని ట్వీట్ చేశారు. కాగా అల్పాహారంలో విద్యార్థినులకు గొడ్డు కారం పెట్టారని పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

News January 8, 2025

నేడు విశాఖకు మోదీ.. కట్టుదిట్టమైన భద్రత

image

AP: ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను SPG తమ ఆధీనంలోకి తీసుకుంది. 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది IPS అధికారులు,18 మంది అడిషనల్ SPలు, 60 మంది DSPలు, 180 మంది CIలు, 400 మంది SIలు పాల్గొననున్నారు. ప్రధాని 3గంటల పాటు విశాఖలో పర్యటించనున్నారు.

News January 8, 2025

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

image

AP: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రత పెంచారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాన్ని జత చేశారు. సీఎంకు NSG, SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ బృందం రక్షణ కల్పించనుంది. SPG ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌కు శిక్షణ ఇస్తున్నారు.