News January 5, 2025

పాలవలసలో మొదలైన సంక్రాంతి సందడి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో గంగిరెద్దుల రాకతో సంక్రాంతి సందడి మొదలైంది. ‘అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అని ఎద్దుల బసవన్నలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అందర్నీ దీవించి వాళ్ళు ఇచ్చిన పండగ కానుకలని స్వీకరిస్తూ వెళుతున్నారు. సన్నాయి చప్పుళ్ల నడుమ గంగిరెద్దుల నృత్యం చేశాయి. ప్రతీ ఏటా ఈ గంగిరెద్దులతో రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది.

Similar News

News January 3, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్
సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ చేరాలి: ఎమ్మెల్యే శిరీష
నరసన్నపేట: రహదారులపై పారుతున్న మురుగు నీరు
జలుమూరు: ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రపంచ తెలుగు మహాసభలకు పొందూరు వాసికి ఆహ్వానం
టెక్కలి: ధాన్యం కొనుగోళ్లులో కానరాని కస్టోడియన్లు జాడ
ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించండి: ఎమ్మెల్యే బగ్గు
జిల్లాలో పలుచోట్ల రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ

News January 2, 2026

సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్

image

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లా మీదుగా నడిచే రెండు ప్రధాన రైళ్లను జిల్లాలోని తిలారు, బారువ, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ లో ఆగనున్నట్లు తెలిపారు. తిలారులో బరంపురం-విశాఖ ఎక్స్ ప్రెస్(18525/18526), బారువలో విశాఖపట్నం న్యూ విశాఖ ఎక్స్ ప్రెస్(22819/22820), ఇచ్ఛాపురంలో పూరీ-అహ్మదాబాద్(12843/12844) రైళ్లు ఆగనున్నట్లు తెలిపారు.

News January 2, 2026

రణస్థలం: ‘108 నిర్లక్ష్యం లేదు’

image

రణస్థలం సూర్య స్కూల్ పరిధిలో డిసెంబర్ 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం తెలిసిందే. 108 రావడం ఆలస్యం కావడంతోనే ఆ వ్యక్తి మరణించాడని స్థానికులు కొందరు తెలపడంతో Way2Newsలో అలాగే ప్రచురితమైంది. కానీ సాంకేతిక సమస్య కారణంగా 108కు కాల్ రీచ్ కాలేదు. కాసేపటికే కాల్ కనెక్ట్ కావడంతో వెంటనే ప్రమాద స్థలికి అంబులెన్స్ వెళ్ళింది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని అధికారులు తెలిపారు.