News January 5, 2025
తమిళనాడు సీఎం కావాలన్నదే నా కోరిక: త్రిష
రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న హీరోయిన్ త్రిష కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టారు. ఈమె వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా పనిచేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 8, 2025
నేడు విశాఖకు మోదీ.. కట్టుదిట్టమైన భద్రత
AP: ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను SPG తమ ఆధీనంలోకి తీసుకుంది. 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది IPS అధికారులు,18 మంది అడిషనల్ SPలు, 60 మంది DSPలు, 180 మంది CIలు, 400 మంది SIలు పాల్గొననున్నారు. ప్రధాని 3గంటల పాటు విశాఖలో పర్యటించనున్నారు.
News January 8, 2025
సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు
AP: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రత పెంచారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాన్ని జత చేశారు. సీఎంకు NSG, SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ బృందం రక్షణ కల్పించనుంది. SPG ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌కు శిక్షణ ఇస్తున్నారు.
News January 8, 2025
రాబోయే 5 రోజులు జాగ్రత్త!
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా ఉంటోంది. రాబోయే 5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని IMD తెలిపింది. సంగారెడ్డి, కొమురం భీమ్ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు, HYD సహా ఇతర జిల్లాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.