News January 5, 2025
మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్: కేటీఆర్

TG: రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రూ.12వేలకే పరిమితం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఆయనొక రైతు ద్రోహి అని, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అని మండిపడ్డారు. ‘రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒడ్డెక్కి తెడ్డు చూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం.. వరంగల్ డిక్లరేషన్ అబద్ధం. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఓ బూటకం’ అని Xలో దుయ్యబట్టారు.
Similar News
News February 9, 2026
నియోజకవర్గాలకు ర్యాంకులు.. విజయవాడ వెస్ట్ టాప్

AP: MLAల పనితీరు, పథకాల అమలు ఆధారంగా 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 21 నియోజకవర్గాలు A+ గ్రేడ్ సాధించగా, A గ్రేడ్‌లో 153 నిలిచాయి. ఒకే ఒక్క నియోజకవర్గం B గ్రేడ్‌కు పరిమితమైంది. 93% మార్కులతో NTR జిల్లాలోని విజయవాడ వెస్ట్ నంబర్ వన్‌గా నిలిచింది. దీనికి సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాజువాక, కాకినాడ సిటీ, విజయవాడ ఈస్ట్.. 2,3,4 ర్యాంకులు సాధించాయి.
News February 9, 2026
BCCI కాంట్రాక్ట్.. క్రికెటర్ల గ్రేడ్లు ఇలా..

యాన్యువల్ <<19095676>>కాంట్రాక్టులో<<>> ఇప్పటివరకు ఉన్న A+ కేటగిరీని BCCI ఎత్తివేసింది.
గ్రేడ్ A- గిల్, బుమ్రా, జడేజా
గ్రేడ్ B- రోహిత్, కోహ్లీ, సుందర్, రాహుల్, సిరాజ్, పాండ్య, పంత్, కుల్దీప్, జైస్వాల్, సూర్య, అయ్యర్
గ్రేడ్ C- అక్షర్, తిలక్, రింకూ, దూబే, సంజూ, అర్ష్‌దీప్, ప్రసిధ్, ఆకాశ్, జురెల్, హర్షిత్, చక్రవర్తి, నితీశ్, అభిషేక్, సుదర్శన్, బిష్ణోయ్, గైక్వాడ్
** ఉమెన్స్ క్రికెటర్ల గ్రేడ్లు పైన ఇమేజ్‌లో చూడొచ్చు.
News February 9, 2026
చెవులు లేకున్నా వింటాయివి!

ప్రత్యేక శరీర ఆకృతి, కండరాల నిర్మాణంతో కొన్ని జీవులు బాహ్య చెవులు లేకున్నా వినగలుగుతాయి. పాములకు దవడ ఎముక ద్వారా లోపలి చెవికి సౌండ్ సిగ్నల్స్ అందుతాయి. సాలీడు కాళ్లపై ఉన్న వెంట్రుకలు వైబ్రేషన్స్ విని అపాయాన్ని పసిగడతాయి. సాలమండర్లు చర్మం, వాటి పుర్రె ఎముకలు.. బల్లుల అంతర్గత శరీరాకృతి వల్ల వినగలుగుతాయి. చాలా రకాల చేపలు సైతం అవి తిరిగే ప్రాంతంలో ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పరచుకొని సౌండ్స్ వింటాయి.


