News January 5, 2025

విశాఖలోనే మంత్రుల మకాం

image

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకడంతో పాటు ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి విశాఖలోనే మకాం వేశారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Similar News

News January 8, 2025

ఆ ప్రతిపాదన లేదు: రాజారెడ్డి

image

నౌకాదళానికి విశాఖ ఎయిర్ పోర్ట్‌ను అప్పగించే ప్రతిపాదన లేదని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్‌ను నేవీకి అప్పగిస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా వాణిజ్య కార్యకలాపాలను మాత్రమే నిలిపివేయడం జరుగుతుందన్నారు. విమానాశ్రయానికి సంబంధించిన ఆస్తులు ఎయిర్పోర్ట్ ఆధీనంలోనే ఉంటాయన్నారు.

News January 8, 2025

విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు

image

ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు నగరానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం 4.45గంటలకు ప్రధాని, సీఎంతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

News January 8, 2025

ఏయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల పరిధిలో నేడు జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు పేర్కొన్నారు. నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని తెలిపారు.