News January 5, 2025
బుమ్రా హెల్త్‌పై గంభీర్ ఏమన్నారంటే?
ఐదో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడంతో బుమ్రా ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారని, వాళ్లే త్వరలో హెల్త్ అప్‌డేట్ ఇస్తారని చెప్పారు. చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన బుమ్రా, బౌలింగ్ చేయలేదు. జస్ప్రీత్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ప్రసిద్ధ్ కృష్ణ నిన్న మీడియాతో అన్నారు. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీశాడు.
Similar News
News January 8, 2025
కేటీఆర్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు
TG: ఏసీబీ విచారణకు లాయర్లను అనుమతించాలని కేటీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. కాగా ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.
News January 8, 2025
5 రోజులు సెలవులు.. నెట్టింట ఫైర్
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్స్ 5 రోజులు సెలవులు ప్రకటించాయి. ఈనెల 13 నుంచి 17వరకు మెస్ పనిచేయదని, ఫుడ్ ఉండదని తెలిపాయి. ఇది హాస్టల్స్ అసోసియేషన్ ఆర్డర్ అని, దీనిని ఏ హాస్టలయినా అతిక్రమిస్తే రూ.20వేలు ఫైన్ విధిస్తుందన్నాయి. దీంతో 30 రోజులకూ ఫీజు చెల్లించామని, ఇలా 5 రోజులు ఫుడ్ లేకపోతే ఎక్కడ తినాలని హాస్టలర్స్ ఫైర్ అవుతున్నారు. పండుగ వేళ హోటల్స్ కూడా క్లోజవుతాయని వాపోతున్నారు.
News January 8, 2025
సినిమాలు మానేద్దామనుకున్నా: శివ కార్తికేయన్
తాను ఒకప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తమిళ హీరో శివ కార్తికేయన్ వెల్లడించారు. ‘ఏమీలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు. అజిత్, విక్రమ్ లాంటి వారూ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారు’ అంటూ తన భార్య మోటివేట్ చేయడంతో ఆగిపోయానని తెలిపారు. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. యాంకర్ స్థాయి నుంచి యాక్టర్‌గా ఎదిగిన నన్ను చాలా మంది అవమానించారు. నా విజయమే వారికి సమాధానం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.