News January 5, 2025

బన్నీకి పోలీసుల నోటీసులు.. ఫ్యాన్స్ అసంతృప్తి

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించలేదని సీఎం రేవంత్‌తో సహా పలువురు అల్లు‌అర్జున్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ బన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కలిసేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో వెళ్లొద్దని పోలీసులు నోటీసులిచ్చారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. తమ హీరో పట్ల అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం సరికాదంటున్నారు. దీనిపై మీ COMMENT.

Similar News

News January 8, 2025

5 రోజులు సెలవులు.. నెట్టింట ఫైర్

image

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్స్ 5 రోజులు సెలవులు ప్రకటించాయి. ఈనెల 13 నుంచి 17వరకు మెస్ పనిచేయదని, ఫుడ్ ఉండదని తెలిపాయి. ఇది హాస్టల్స్ అసోసియేషన్ ఆర్డర్ అని, దీనిని ఏ హాస్టలయినా అతిక్రమిస్తే రూ.20వేలు ఫైన్ విధిస్తుందన్నాయి. దీంతో 30 రోజులకూ ఫీజు చెల్లించామని, ఇలా 5 రోజులు ఫుడ్ లేకపోతే ఎక్కడ తినాలని హాస్టలర్స్ ఫైర్ అవుతున్నారు. పండుగ వేళ హోటల్స్ కూడా క్లోజవుతాయని వాపోతున్నారు.

News January 8, 2025

సినిమాలు మానేద్దామనుకున్నా: శివ కార్తికేయన్

image

తాను ఒకప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తమిళ హీరో శివ కార్తికేయన్ వెల్లడించారు. ‘ఏమీలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు. అజిత్, విక్రమ్ లాంటి వారూ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారు’ అంటూ తన భార్య మోటివేట్ చేయడంతో ఆగిపోయానని తెలిపారు. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. యాంకర్ స్థాయి నుంచి యాక్టర్‌గా ఎదిగిన నన్ను చాలా మంది అవమానించారు. నా విజయమే వారికి సమాధానం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News January 8, 2025

ఫార్ములా-ఈ కేసు: విచారణకు హాజరైన నిందితులు

image

TG: ఫార్ములా-ఈ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లతో హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ.45.71కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.