News January 5, 2025

పిఠాపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పిఠాపురం పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అటుగా వెళుతున్న సైకిలిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పిఠాపురం పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2026

పెరవలి: ఆ రోజులే మళ్లీ రప్పించాయి

image

పెరవలి మండలంలోని కానూరు శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2005-2006 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 ఏళ్లకు తరువాత కలుసుకుని అప్పటి మధుర జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు.

News January 11, 2026

ఖేలో ఇండియాలో ఏపీకి రజతం.. దేవరపల్లి క్రీడాకారుల ప్రతిభ!

image

గుజరాత్‌లోని డామన్ అండ్ డయ్యూలో జరిగిన రెండవ ఖేలో ఇండియా గేమ్స్‌లో ఏపీ సెపక్ తక్రా జట్టు రెండోస్థానం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో బీహార్‌పై ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఏపీ జట్టులో ప్రతిభచాటిన దేవరపల్లి క్రీడాకారులు లక్కా గణపతి, పాటంశెట్టి సాయిలను సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు, హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News January 11, 2026

రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్‌ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.