News January 5, 2025
కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE
TGలో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 26 నుంచి జారీ చేయనుంది. ఇందుకోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఛాన్సుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. అర్హతల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, గత విధానాలనే యథాతథంగా కొనసాగించే ఛాన్సుంది. గ్రామసభలు, బస్తీ సభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే వచ్చిన 12 లక్షల దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంది.
Similar News
News January 8, 2025
అభిమానుల కుటుంబాలకు రాంచరణ్ పరిహారం
‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డుప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రాంచరణ్ పరిహారం అందజేశారు. RTGS ద్వారా పేమెంట్ చేయగా, దానికి సంబంధించిన వివరాలను చెర్రీ ఫ్యాన్స్ బాధితుల తల్లిదండ్రులకు అందించారు. కాగా కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ రోడ్డుప్రమాదంలో మరణించారు. వీరికి పవన్, రాంచరణ్, దిల్ రాజు చెరో రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
News January 8, 2025
కాంగ్రెస్‌కు షాక్: ఢిల్లీలో ఆప్‌కే INDIA మద్దతు
‘INDIA’లో కాంగ్రెస్‌పై అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ AAPకే మద్దతు ఇస్తున్నాయి. SP, SS UBT, TMC, RJD అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ప్రచారం చేయనున్నాయి. హస్తం పార్టీనెవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలే లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్యారీ దీదీ స్కీమ్‌నూ DK శివకుమార్ ప్రకటించారు. INC ఎలాగూ గెలవదనే కూటమి AAP వైపు మళ్లినట్టుంది.
News January 8, 2025
BITCOIN షాక్: 24 గంటల్లో Rs5 లక్షల నష్టం
క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 6.29% తగ్గి $3.36Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ ఏకంగా 5.45% ఎరుపెక్కింది. $1,02,000 నుంచి $96,000కు తగ్గింది. అంటే $6000 (Rs 5.10L) నష్టపోయింది. మార్కెట్ విలువ $1.91Tకి తగ్గింది. ఇథీరియం 9.98% పడిపోయి $3,349 వద్ద కొనసాగుతోంది. XRP 4.16, BNB 4.59, SOL 8.95, DOGE 10.53, ADA 8.77, TRON 7.56, SUI 7.32, LINK 10.51% మేర ఎరుపెక్కాయి.